విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్
- విజయ్ దేవరకొండ, రష్మికలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం
- పెళ్లికి వెళుతున్నారా అని తరుణ్ భాస్కర్‌ని ప్రశ్నించిన మీడియా ప్రతినిధి
- ఆహ్వానం అందలేదు... వచ్చాక వాట్సాప్ చేస్తాను అందరం వెళదామని వ్యాఖ్య
ఈ నెల 26న విజయ్, రష్మికలు వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో, త్వరలో విజయ్ దేవరకొండ వివాహమని తెలిసింది, మీరు వెళుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానిస్తే మీకు కూడా వాట్సాప్‌లో పంపిస్తానని, అప్పుడు కలిసి వెళదామని తరుణ్ భాస్కర్ సమాధానమిచ్చారు. విజయ్, తరుణ్ భాస్కర్ మంచి స్నేహితులు. తరుణ్ దర్శకత్వంలో, విజయ్ హీరోగా 2016లో వచ్చిన 'పెళ్లిచూపులు' చిత్రం ఘన విజయం సాధించింది.