నాలుగున్నర దశాబ్దాల తర్వాత... 100 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా తేల్చిన యూపీ హైకోర్టు
- 1982లో జరిగిన హత్య ఘటనలో నిందితుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు
- 1984లో నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు
- విచారణలో జాప్యం, ప్రాసిక్యూషన్ లోపాలను ఎత్తి చూపిన హైకోర్టు
ఈ కేసును విచారించిన హమీన్‌పూర్ సెషన్స్ కోర్టు 1984లో ధనీరామ్, సత్తిదిన్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది. సెషన్స్ కోర్టు తీర్పుపై 40 ఏళ్ల క్రితం వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. పిటిషన్ విచారణ దశలో ఉండగా, వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మైకు అరెస్టు కాలేదు.
ఈ కేసును హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ప్రధాన నిందితుడు మైకును అరెస్టు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. అనంతరం ధనీరామ్ అప్పీలుపై నిర్ణయంలో జాప్యం, ప్రాసిక్యూషన్‌లో లోపాలను ఎత్తి చూపిన న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేల్చింది. అతడి వయస్సును కూడా పరిగణనలోకి తీసుకుని నిర్దోషిగా తేల్చింది.