'యుఫోరియా' సందడి.. రిలీజ్‌కు ముందు స్పెషల్ ప్రీమియర్ షో
- ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానున్న 'యుఫోరియా' చిత్రం
- దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఈ చిత్రానికి నిర్మాత
- రిలీజ్‌కు ముందురోజే (ఫిబ్రవరి 5) ప్రత్యేక ప్రీమియర్ షో
- నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా
హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ 70MM థియేటర్‌లో ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ఈ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శన జరగనుంది. ఈ షోకు 'యుఫోరియా' చిత్ర బృందం హాజరై ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించనుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాకు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ, యుక్త గుణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. 'యుఫోరియా'లో భూమిక చావ్లా, గౌతమ్ మీనన్, సారా అర్జున్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.