రేపు మండలి చైర్మన్ మోషేను రాజు కుమారుడి వివాహం... హాజరుకానున్న జగన్
- రేపు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జగన్ పర్యటన
- మండలి ఛైర్మన్ కొయ్యే మోసేను రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరు
- ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్
- మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనం
వివరాల్లోకి వెళితే, రేపు ఉదయం 10:30 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పెదఅమిరంలోని శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌కు వెళ్లి వివాహ వేడుకలో పాల్గొంటారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, మధ్యాహ్నం 12:00 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి బయలుదేరుతారు.
మాజీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భీమవరం, పెదఅమిరం ప్రాంతాల్లోని వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.