పవన్ కల్యాణ్ పై టీపీసీసీ చీఫ్ విమర్శలు.. తీవ్రంగా స్పందించిన తెలంగాణ జనసేన
- పవన్ ఏపీలో రాజకీయాలు చేసుకోవాలన్న మహేశ్ గౌడ్
- జనసేన కేవలం ఏపీ కోసం పెట్టిన పార్టీ కాదన్న తెలంగాణ జనసేన
- ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన స్పందిస్తూ... కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు తెలంగాణ రాష్ట్ర పార్టీలు కాదని... అవి జాతీయ పార్టీలని తెలిపింది. జనసేన అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన పార్టీ కాదని... జాతీయ సమగ్రత కోసం తెలంగాణలో పెట్టిన పార్టీ అని పేర్కొంది. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది.