ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: పార్లమెంటు వద్ద వైసీపీ ఎంపీల నిరసన
- ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు
- ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని నినాదాలు
- కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల నివాసాలపై దాడుల నేపథ్యంలో వైసీపీ ఎంపీలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసి పరిస్థితిని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి పరిస్థితులను ఆయనకు వివరించాలని వైసీపీ భావిస్తోంది.