భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడిందనే మాట నేను చెప్పింది కాదు: రాహుల్ గాంధీ
- స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ నరవణే తన పుస్తకంలో రాశారని వెల్లడి
- ఈ పుస్తకం బయటకు వస్తే ప్రజలకు విషయం తెలుస్తుందని కేంద్రానికి భయం పట్టుకుందని వ్యాఖ్య
- దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని లోక్ సభలో లేవనెత్తేందుకు అనుమతించడం లేదని ఆరోపణ
లోక్ సభ వాయిదా పడిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని లోక్ సభలో లేవనెత్తేందుకు అనుమతించడం లేదని ఆరోపించారు. నరవణే రాసిన పుస్తకం పబ్లిష్ అయితే ప్రభుత్వ నేతలు మన సైన్యాన్ని ఎలా నిరాశపరిచారనే విషయాలు ప్రజలు తెలుసుకుంటారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు చెబుతాననే తనను మాట్లాడనీయడం లేదని అన్నారు.