ఓడిపోతామనే భయంతోనే మనతో ఆడకుండా పాక్ తప్పించుకుంటోంది: కీర్తి ఆజాద్
- పాకిస్థాన్ ఒక విఫల దేశం అన్న కీర్తి ఆజాద్
- ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకుండా భారత్ తప్పుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్య
- గెలవలేమని తెలిసినప్పుడు కొందరు మైదాన్ని వీడాలనుకుంటారన్న శశాంక్ మణి
పాకిస్థాన్ వంటి ఒక విఫల దేశం మనతో క్రికెట్ ఆడేందుకు నిరాకరిస్తోందని కీర్తి ఆజాద్ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో... ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకుండా భారత్ అప్పుడు తప్పుకుని ఉంటే... ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా బలమైన సందేశం వెళ్లేదని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాద దేశం పాకిస్థాన్ అనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిందని అన్నారు.
మరోవైపు, బీజేపీ ఎంపీ శశాంక్ మణి కూడా పాక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గెలవలేమని తెలిసినప్పుడు కొందరు మైదానాన్ని వీడి వెళ్లాలనుకుంటారని అన్నారు. ఇండియా గెలుస్తుందనే భయంతోనే మనతో ఆడటానికి పాకిస్థాన్ నిరాకరిస్తోందని చెప్పారు.