అతడితో విడిపోయినందుకు బాధ లేదు... జాలిపడ్డాను: బ్రేకప్‌పై మృణాల్ ఠాకూర్
- లవ్ బ్రేకప్‌పై స్పందించిన నటి మృణాల్ ఠాకూర్
- నా దూకుడు, నేను నటించడం నచ్చలేదని అతను విడిపోయాడని వెల్లడి
- విడిపోయినందుకు బాధపడలేదని, అతడిపై జాలి మాత్రమే వేసిందని వ్యాఖ్య
- ధనుష్, శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్ రూమర్లను కొట్టిపారేసిన మృణాల్
అంతేకాదు, తన పాత లవ్ స్టోరీని కూడా గుర్తుచేసుకున్నారు. "నాకు దూకుడు ఎక్కువని, నాతో ఉండలేనని అతడు బ్రేకప్ చెప్పాడు. నేను యాక్టింగ్ చేయడం కూడా అతనికి ఇష్టం లేదు. అందుకే విడిపోయాం" అని తెలిపారు. అయితే, ఈ బ్రేకప్ పట్ల తాను ఏమాత్రం బాధపడలేదని, పైగా అతని ఆలోచనా విధానం పట్ల జాలిపడ్డానని అన్నారు. "అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో కొనసాగితే, భవిష్యత్తులో పిల్లలు కూడా అదే భావనలతో పెరుగుతారు. అది నాకు ఇష్టం లేదు" అని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం తన కొత్త చిత్రం 'దో దీవానే శహర్ మే' ప్రమోషన్లలో బిజీగా ఉన్న మృణాల్, ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.