కాపు కులాన్ని కట్టుబట్టలతో వేరే రాష్ట్రానికి పంపించే కార్యక్రమం చేయండి: చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ
- అంబటి, జోగి రమేశ్ లను ఘోరంగా అవమానించారన్న ముద్రగడ
- చంద్రబాబు మీద కాపు కులం కోపంగా ఉందని వ్యాఖ్య
- పవన్ పై ప్రేమతోనే మీకు కాపులు మద్దతిచ్చారన్న ముద్రగడ
కాపు కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్నా... పవన్ కల్యాణ్ పై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందనేది తన అభిప్రాయమని ముద్రగడ పేర్కొన్నారు. దయచేసి కాపు కులాన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండని అన్నారు.
