ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు
- ఏనిమిది అంతస్తుల భవనంలో పేలుడు
- భవనంతో పాటు వాహనాలు, దుకాణాలు ధ్వంసం
- నేవీ కమాండర్ లక్ష్యంగా దాడి జరిగినట్లు ప్రచారం
- ఖండించిన స్థానిక మీడియా
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ కమాండర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. స్థానిక మీడియా మాత్రం వాటిని ఖండించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ పేలుడు కలకలం రేపింది.
బందర్ అబ్బాస్ నౌకాశ్రయం హర్ముజ్ జలసంధిలో ఉంది. ఇరాన్, ఒమన్‌ల మధ్య ఇది కీలక జలమార్గం. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా బందర్ అబ్బాస్ సమీపంలోని పోర్టులో భారీ పేలుడు సంభవించిన ఘటనలో వందలాదిమంది గాయపడినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి.