ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం అన్ని పనులు పూర్తి: నిర్మాణ కమిటీ ఛైర్మన్
- ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1,900 కోట్లుగా అంచనా వేసినట్లు వెల్లడి
- రూ.1,600 కోట్లు ఇప్పటికే చెల్లించామన్న నిర్మాణ కమిటీ ఛైర్మన్
- ఏప్రిల్ 30 నాటికి పేపర్ వర్క్, బిల్లు చెల్లింపులు పూర్తవుతాయన్న ఛైర్మన్
రామాలయంలో మిగిలిన పనులు వేగంగా సాగుతున్నాయని, మరో మూడు నెలల్లో అవి పూర్తవుతాయని తెలిపారు. రూ.1,900 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.1,600 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నాటికి పేపర్ వర్క్, బిల్లు చెల్లింపులు కూడా పూర్తవుతాయని అన్నారు. ఆ తర్వాత ఆలయం శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ పరిధిలోకి వస్తుందని వెల్లడించారు.