తెలంగాణలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్
- తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్
- అసెంబ్లీ, మండలి, సచివాలయంలోనూ రిపబ్లిక్ డే సంబరాలు
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర సచివాలయంతో పాటు జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది.