నిద్రిస్తున్న హిందూ యువకుడి సజీవ దహనం.. బంగ్లాదేశ్ లో మరో ఘోరం
- మైనారిటీ హిందువులపై బంగ్లాదేశ్ లో ఆగని హింస
- హిందూ యువకుడి షాపుకు నిప్పు పెట్టిన దుండగులు
- యువకుడు చనిపోయాడని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి వెళ్లిపోయిన వైనం
కుటుంబానికి చంచలే ఆధారం..
చంచల్ భౌమిక్ తండ్రి చాలాకాలం క్రితమే చనిపోయాడు. తల్లితో పాటు ఇద్దరు సోదరులను చంచల్ తన కష్టంతో పోషిస్తున్నాడు. ఇందుకోసం నార్సింగ్డి ప్రాంతంలోని గ్యారేజీలో చంచల్ ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా, చంచల్ ను దుండగులు పథకం ప్రకారమే చంపేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి ఉన్న ఒక్క ఆధారం కూడా పోయిందని చంచల్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.