'హక్' సినిమాపై సమంత స్పందన
- యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్లో 'హక్'
- ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సమంత
- భావోద్వేగానికి గురయ్యానని వ్యాఖ్య
'హక్' చిత్రాన్ని చూసి తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని సమంత చెప్పింది. సినిమా చూడటం అయిపోయిన వెంటనే... దీని గురించి కొన్ని మాటలు రాయాలనిపించిందని తెలిపింది. ఆ సినిమాలోని సన్నివేశాలను చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపింది. ఆ భావోద్వేగాలను కొంచెం కూడా కోల్పోకూడదని తాను అనుకున్నానని చెప్పింది. లోతైన మానవీయ కోణంలో సినిమాను తెరకెక్కించారని... పక్షపాతం లేకుండా ఎవరినీ తక్కువ చేయకుండా చూపించాని తెలిపింది. యామీ గౌతమ్ ఈ కథకు ప్రాణం పోసిందని ప్రశంసించింది.