ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులపై ప్రచారం సరికాదు: శ్రీధర్ బాబు
- ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు
- నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై తప్పుడు ప్రచారం సరికాదన్న మంత్రి
- రాజకీయ వైరుధ్యాలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలన్న మంత్రి
మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య కథనాలను ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఈ సమయంలో విషపూరిత ప్రచారం చేయడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలని సూచించారు. కానీ అబద్ధపు ప్రచారాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఒక ప్రధాన టీవీ ఛానల్‌లో ఈ ప్రచారం జరగడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.