సాయిబాబాపై కామెంట్స్... నటి మాధవీలతపై ఎఫ్ఐఆర్
- షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాధవీలత!
- భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ పోలీసులకు ఫిర్యాదు
- మాధవీలతతో పాటు కొందరు యూట్యూబర్లపైనా కేసు నమోదు
- మంగళవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ
- సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై పోలీసుల హెచ్చరిక
గత కొద్దికాలంగా సామాజిక, రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తున్న మాధవీలత, ఇటీవల సాయిబాబాను ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల నమ్మకాలను కించపరిచేలా ఉన్నాయని కొందరు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, మాధవీలతతో పాటు ఆమెకు మద్దతుగా ఇంటర్వ్యూలు చేసి, వీడియోలు ప్రచారం చేసిన వారిపైనా కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నిందితులందరికీ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇతరుల నమ్మకాలను కించపరిచినా లేదా అసత్య ప్రచారాలు చేసినా ఐటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వ్యూస్ కోసం వివాదాలను ప్రోత్సహించే యూట్యూబ్ ఛానెళ్లపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు.