ఓటీటీకి వచ్చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్!
- తెలుగు సిరీస్ గా 'కానిస్టేబుల్ కనకం'
- 6 ఎపిసోడ్స్ గా ఆకట్టుకున్న సిరీస్
- ప్రధానమైన పాత్రలో మెప్పించిన వర్ష బొల్లమ్మ
- జనవరి 8వ తేదీ నుంచి సీజన్ 2
1998 కాలంలో ఈ కథ మొదలవుతుంది. 'రేపల్లె' విలేజ్ కి సమీపంలోని 'అడవిగుట్ట' దిశగా వెళ్లడానికి ఆ గ్రామస్తులు చాలా భయపడుతూ ఉంటారు. అందుకు కారణం అటువైపు వెళ్లినవారు తిరిగి రాకపోవడమే. దాంతో చీకటిపడితే బయటకి రావడానికి జనాలు భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలోనే, పోలీస్ కానిస్టేబుల్ గా కనకం ఆ గ్రామానికి వస్తుంది. జరుగుతున్న సంఘటనలు ఆమెకి అనేక రకాల సందేహాలను కలిగిస్తాయి.
ఆ గ్రామ సర్పంచ్ తీరు కూడా ఆమెకి అనుమానాన్ని కలిగిస్తుంది. చంద్రిక అనే అమ్మాయి మిస్సింగ్ వెనుక గల కారణం ఏమిటో తెలుకోవాలనే ఉద్దేశంతో కనకం రంగంలోకి దిగుతుంది. అక్కడి నుంచి మిగిలిన కథ సీజన్ 2లో పరిగెత్తనుంది. జనవరి 8వ తేదీ నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. మొదటి సీజన్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ సిరీస్, సీజన్ 2లో ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేది చూడాలి.