ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి
- విజయనగరం జిల్లా గణపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘటన
- ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తుండగా ప్రమాదం
- అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న వ్యాన్
- మృతులు విశాఖకు చెందిన విజయకుమార్, దిశేష్‌లుగా గుర్తింపు
ఒడిశాలోని రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులను విశాఖకు చెందిన పొట్నూరు విజయకుమార్, దినేష్ లుగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.