ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో రేపు ఉదయం సీడబ్ల్యుసీ కీలక సమావేశం
- మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం
- దేశంలోని రాజకీయ పరిస్థితులు సహా వివిధ అంశాలపై చర్చించనున్న సీడబ్ల్యూసీ
ఈ సమావేశంలో, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రాబోయే ఎన్నికలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.