షేక్ హసీనా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న హిందూ నేత
- గోపాల్‌గంజ్–3 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న గోవిందా చంద్ర ప్రామాణిక్
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటన
- ప్రజా సమస్యలను లేవనెత్తేందుకే పోటీ చేస్తున్నట్టు వెల్లడి
దేశంలో హిందూ జనాభా తగ్గుతుండటం, మైనార్టీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందూ నేత కీలక స్థానం నుంచి పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనుండగా, హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం కారణంగా ఆ పార్టీ ఎన్నికల్లో పాల్గొనలేదని తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది.