ఈక్వెస్ట్రియన్ క్రీడాకారుడు శశాంక్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
- ఏషియన్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో రజత పతకం సాధించిన శశాంక్
- ఈ క్రీడల్లో పదేళ్ల అనుభవం వుందని సీఎంకు తెలిపిన శశాంక్
- భవిష్యత్తులో శశాంక్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన చంద్రబాబు
ఈ నేపథ్యంలో శశాంక్ నిన్న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. గుర్రపు స్వారీ చేస్తూ హర్డిల్స్ దాటే ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ క్రీడల్లో తనకు పదేళ్ల అనుభవం ఉందని శశాంక్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.