వుడా మాజీ చీఫ్ ప్రదీప్ కుమార్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
- ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 2018లో ప్రదీప్ కుమార్‌పై ఏసీబీ కేసు
- ప్రదీప్ కుమార్ ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించిన ఈడీ అధికారులు
- హైదరాబాద్‌లో ఉన్న 1.09కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ప్రదీప్ కుమార్‌పై 2018లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ కేసులో ప్రదీప్ కుమార్, ఆయన అర్ధాంగి పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు, బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్ చేసింది.