కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: పోచారం
- కేటీఆర్ తనను దుర్భాషలాడారన్న పోచారం
- రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని కితాబు
- సర్పంచ్ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్య
సర్పంచ్ పదవి రాజ్యాంగ బద్దమైనదని... దాని విలువను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పోచారం అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా నిధులను సమకూరుస్తుందని... ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.