ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ సమావేశాలు
- జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశాలు
- నియోజకవర్గాల అభివృద్ధి, సమస్యలపై ప్రధానంగా చర్చ
- ఈ రోజు 9 మంది శాసనసభ్యులతో ముఖాముఖి భేటీలు
- మండలి బుద్ధ ప్రసాద్‌తో మొదలైన సమావేశాల పరంపర
ఈ సమీక్షల్లో భాగంగా, ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరు, కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా, నియోజకవర్గాల్లో ఇంకా పరిష్కారం కాని సమస్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చిస్తారు.
ఈ రోజు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మండలి బుద్ధ ప్రసాద్ అనంతరం దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సీహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, సుందరపు విజయ్ కుమార్ లతో ఆయన ముఖాముఖి భేటీ అవుతారు.