జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ తప్ప మరొకరైతే గెలిచేవాళ్లు కాదు: రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే
- అభ్యర్థిని ఎంపిక చేసిన సమయంలో రేవంత్ రెడ్డి పలువురి అభిప్రాయం తీసుకున్నారని వెల్లడి
- తనను అడిగితే, నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడని చెప్పానన్న ప్రకాశ్ గౌడ్
- శ్రీశైలం యాదవ్ సినిమా వాళ్లతో ఎంతో స్నేహంగా ఉండేవారన్న ఎమ్మెల్యే
తనను కూడా రేవంత్ రెడ్డి అడిగితే, "జూబ్లీహిల్స్‌లో ఎవరూ గెలవరు.... నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడు" అని తాను చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి మరికొందరి అభిప్రాయాలు తీసుకుంటే అందరూ అదే చెప్పారని అన్నారు. వాస్తవం చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నవీన్ యాదవ్ ఉండటం వల్లే గెలిచాడని అన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సహకరించారని ప్రకాశ్ గౌడ్ అన్నారు. శ్రీశైలం యాదవ్ కూడా సినిమా వాళ్లతో ఎంతో స్నేహంగా ఉంటారని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారని అన్నారు. వారంతా నవీన్ యాదవ్‌కు అండగా నిలబడ్డారని ప్రకాశ్ గౌడ్ తెలిపారు.