ఓటీటీలోకి వస్తున్న ఐశ్వర్యా రాజేశ్ థ్రిల్లర్ మూవీ
- అర్జున్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన ‘మఫ్టీ పోలీస్’
- థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని క్రైమ్ థ్రిల్లర్
- ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు సిద్ధం
- డిసెంబర్ 19 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి
తమిళంలో 'తీయవర్ కులై నడుంగ' పేరుతో గత నెల 21న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. తెలుగులో 'మఫ్టీ పోలీస్' పేరుతో డబ్ చేసి విడుదల చేసినప్పటికీ, సరైన ప్రచారం లేకపోవడంతో ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. అయితే, థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ చిత్ర తమిళ వెర్షన్ 'సన్ నెక్స్ట్' ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇక కథ విషయానికొస్తే, ఒక అపార్ట్‌మెంట్‌లో రచయిత్రి జెబా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఇన్స్‌పెక్టర్ మాగుడపాటి (అర్జున్) టేకప్ చేస్తాడు. అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరినీ అనుమానితులుగా పరిగణిస్తూ దర్యాప్తు మొదలుపెడతాడు. అసలు జెబాను హత్య చేసింది ఎవరు? ఈ హత్య వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది.