ఢిల్లీ వాయు కాలుష్యం ఎఫెక్ట్.. ఎలక్ట్రిక్ బైక్పై పార్లమెంటుకు వచ్చిన తెలంగాణ ఎంపీ
- ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎలక్ట్రిక్ బైక్పై వచ్చిన గడ్డం వంశీ
- ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ దారుణంగా పడిపోయిందని ఆందోళన
- అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచన
వాయు నాణ్యత ఇదే విధంగా క్షీణిస్తే భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 493గా నమోదైంది. ఈ కారణంగా ఢిల్లీ మీదుగా వెళ్లే వందలాది విమానాలను రద్దు చేయవలసి వచ్చింది.