కవిత వర్సెస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే... ఐడీపీఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- కవిత భర్త అనిల్‌పై మాధవరం కృష్ణారావు భూకబ్జా ఆరోపణలు
- పరస్పరం ఆరోపణలు చేసుకున్న కవిత, ఎమ్మెల్యే
- వివాదం సంచలనంగా మారడంతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఇటీవల కవిత భర్త అనిల్‌పై మాధవరం కృష్ణారావు భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కవిత తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
తన భర్తపై చేసిన ఆరోపణలకు సంబంధించి లీగల్ నోటీసులు పంపిస్తానని కవిత హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలపై కృష్ణారావు స్పందిస్తూ లీగల్ నోటీసులు పంపించుకోవచ్చని అన్నారు. అనిల్ భూకబ్జాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మీడియాకు, రాజకీయ పార్టీలకు అందజేస్తానని కృష్ణారావు తెలిపారు.