'ప్రేమలు' బ్యూటీతో సూర్య సినిమా.. షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన టీమ్
- సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో సినిమా
- అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదంటున్న సినీ వర్గాలు
- హీరోయిన్‌గా ప్రేమలు ఫేమ్ మమితా బైజు
- 2026 వేసవిలో సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్
మలయాళంలో ‘ప్రేమలు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘సూరారై పోట్రు’ తర్వాత సూర్యతో మళ్లీ పనిచేస్తున్నానని, ఆ సినిమా ఆల్బమ్ ఎంత స్పెషల్‌గా నిలిచిందో, ఈ సినిమా ఆల్బమ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందని జీవీ ప్రకాశ్ గతంలోనే ధీమా వ్యక్తం చేశారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రాన్ని 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.