'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ
- అభిమానుల చేతుల మీదుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట
- ఒకేసారి లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణకు ప్లాన్
- 'దేఖ్లేంగే సాలా' అంటూ రాబోతున్న పవన్ కల్యాణ్
- ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు పాట విడుదల
'దేఖ్ లేంగే సాలా' అంటూ సాగే ఈ పాట లిరిక్ షీట్‌ను లాంచ్ చేసేందుకు అభిమానులు చిత్ర బృందం సూచించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. లక్ష మంది తమ ఎంట్రీలను నమోదు చేసిన వెంటనే, అదే వెబ్‌సైట్‌లో లిరిక్ షీట్ ప్రత్యక్షమవుతుంది. ఈ వినూత్న ప్రచారంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాటను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, 'దేఖ్ లేంగే సాలా' పాటకు భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్-దేవిశ్రీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.