ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వస్తారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య
- కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ
- శాసనసభ సమావేశాల అనంతరం శివకుమార్ సీఎంగా వస్తారన్న ఇక్బాల్ హుస్సేన్
- పార్టీ కోసం ఆయన చేసిన కృషి ఆ స్థానంలో కూర్చోబెడుతుందని వ్యాఖ్య
"నేను మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. ఈ సమావేశాల అనంతరం శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు" అని ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివకుమార్‌కు ఆ అవకాశం ఉందని, ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ కోసం శివకుమార్ చేసిన పోరాటం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి ఆయనను ఆ స్థానంలో కూర్చోబెడతాయని ఇక్బాల్ హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు.