ఓటీటీలోకి వచ్చేసిన '12ఏ రైల్వే కాలనీ' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో '12ఏ రైల్వే కాలనీ' స్ట్రీమింగ్
- నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన చిత్రం
- అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలు
నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లరి నరేశ్‌కు జోడీగా కామాక్షి భాస్కర్ల నటించారు. సీనియర్ నటుడు సాయికుమార్, గెటప్ శ్రీను, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ మరోసారి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇక కథ విషయానికొస్తే.. వరంగల్ రైల్వే కాలనీలో నివసించే అనాథ కార్తీక్ (అల్లరి నరేశ్), స్థానిక రాజకీయ నాయకుడికి నమ్మినబంటుగా ఉంటాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆరాధన ఎవరు? ఆమె గతం ఏమిటి? ఆమె తన భార్య అంటూ కథలోకి ప్రవేశించిన జయదేవ్ షిండే ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.