థియేటర్లలో బాలయ్య తాండవం... ‘అఖండ 2’ రిలీజ్ టీజర్ వచ్చేసింది!
- నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ 2’
- డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు!
- గ్రాండ్ రిలీజ్ టీజర్ పంచుకున్న మేకర్స్
- డిసెంబర్ 11న గ్రాండ్ ప్రీమియర్ షోలు
- ‘అఖండ’కు సీక్వెల్‌గా భారీ అంచనాలతో వస్తున్న చిత్రం
గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘అఖండ’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, బాలయ్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయిక. తమన్ మరోసారి తన సంగీతంతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. రిలీజ్ టీజర్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగింది.