ప్రపంచాన్ని చుట్టేయండి: స్ఫూర్తిదాయక సందేశంతో రష్మిక కొత్త ఫొటోలు
- తన తాజా ట్రిప్ విశేషాలను పంచుకు రష్మిక
- వైట్ డ్రెస్‌లో ఉన్న తన ట్రావెల్ ఫోటోలను అభిమానులతో పంచుకున్న నటి
- ఆడవారి శక్తి అసామాన్యమంటూ ఇటీవల రష్మిక చేసిన పోస్ట్ కూడా వైరల్
ఇటీవల రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. సినిమాలోని ఒక కీలక సన్నివేశాన్ని షేర్ చేస్తూ "తప్పక చూడాల్సిన సినిమా" అని పేర్కొన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.
రష్మిక అప్పుడప్పుడు తన పోస్టులతో అభిమానులను ఆలోచింపజేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ‘ఫెమినిన్ ఎనర్జీ’ గురించి ఆమె చేసిన పోస్ట్ కూడా బాగా వైరల్ అయింది. మహిళలు ఒకరికొకరు తోడుగా నిలిస్తే అద్భుతాలు చేయగలరని, వారి శక్తి అన్‌స్టాపబుల్ అని ఆమె ఆ పోస్టులో అభిప్రాయపడ్డారు.