ఈ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది:'ఓజీ' విలన్ సుదేవ్ నాయర్!
- యంగ్ విలన్ గా సుదేవ్ నాయర్
- మలయాళంలో పాప్యులర్ ఆర్టిస్ట్
- తెలుగులోను దక్కిన గుర్తింపు
- కన్నడలోను ఎంట్రీ ఇచ్చిన నటుడు
"నేను పుట్టింది ముంబైలో .. ఇప్పటికీ అమ్మానాన్న అక్కడే ఉంటారు. నేను మాత్రం 'త్రివేండ్రం'లో సెటిలయ్యాను. సినిమాలలో మా ఫ్యామిలీకి సంబంధించిన వారెవరూ లేరు. నటనలో శిక్షణ తీసుకుని నేనే ప్రయత్నాలు చేస్తూ .. అవకాశాలు సంపాదించుకుంటూ వెళ్లాను. సరైన గుర్తింపు రావడానికి పదేళ్లు పట్టింది. మొదటిసారి మమ్ముట్టి గారి కాంబినేషన్ లో చేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డాను" అని చెప్పారు.
"తెలుగులో నా మొదటి సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఆ తరువాత 'దేవర' .. 'ఓజీ' సినిమాలు చేశాను. ఈ రెండు సినిమాలలోని పాత్రలు నాకు మరింత గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఎన్టీఆర్ గారితో చాలా క్లోజ్ గా మాట్లాడే అవకాశం దక్కింది. పవన్ కల్యాణ్ గారి బిజీ షెడ్యూల్స్ వలన పెద్దగా మాట్లాడటం కుదరలేదు. ప్రస్తుతం కన్నడలో 'యశ్' తోను ఒక సినిమా చేస్తున్నాను" అని అన్నారు.