క్లైమాక్స్ ను మించిన ప్రీ క్లైమాక్స్ !
- రీసెంటుగా రిలీజైన సినిమా
- హైలైట్ గా నిలిచే ప్రీ క్లైమాక్స్
- ఆడియన్స్ తో ఔరా అనిపించే సీన్
- క్లైమాక్స్ కంటే ఎక్కువ ఇంపాక్ట్
అయితే కథ ఏదైనా ప్రీ క్లైమాక్స్ కి మించి క్లైమాక్స్ ఉండవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో క్లైమాక్స్ కంటే ప్రీ క్లైమాక్స్ హెవీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కంటే కూడా ప్రీ క్లైమాక్స్ ఎక్కువ ఇంపాక్ట్ ను చూపిస్తుంది. అలాంటి అరుదైన ఒక సన్నివేశం మనకి 'కాంతార: చాప్టర్ 1'లో కనిపిస్తుంది. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో రాజుకీ .. హీరోకి మధ్య అడవిలో చోటుచేసుకునే సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది. దేవుడు ఆవేశించినట్టుగా హీరో చేసే హడావిడి ఆడియన్స్ తో ఔరా అనిపిస్తుంది.
ఈ సీన్ చూస్తున్ననంత సేపు ఇదే క్లైమాక్స్ సీనేమో అనిపిస్తుంది. ఇంత జరిగిన తరువాత ఇంకా ఏం ఉంటుందనే ఆలోచన కలుగుతుంది. అయితే క్లైమాక్స్ ను కూడా బాగానే డిజైన్ చేశారు .. గ్రాఫిక్స్ తో హడావిడి చేశారుగానీ, ఆడియన్స్ పై ప్రీ క్లైమాక్స్ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. క్లైమాక్స్ కంటే ఎక్కువ మార్కులను కొట్టేస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో క్లైమాక్స్ కంటే, ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన ప్రీ క్లైమాక్స్ కలిగినదిగా 'కాంతార: చాప్టర్ 1' కనిపిస్తుందని చెప్పచ్చు.