ఓటీటీలోకి మిరాయ్.. ఈ నెల 10 నుంచి ప్రసారం
- జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్
- తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం
- థియేట్రికల్ రన్‌లో ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు
థియేట్రికల్ రన్‌లో మిరాయ్ రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాది టాలీవుడ్ లో టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ‘మిరాయ్’ కథలో పురాణ గాథలు, దైవశక్తులు, ఆధునిక సాహసాలు కలిసిన ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను కార్తీక్ ఘట్టమనేని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. సామ్రాట్ అశోక్ కాలం నాటి దైవశక్తి, తొమ్మిది గ్రంథాలు, వాటి రక్షకులు, మానవ లోభం మధ్య జరిగే యుద్ధం ఈ కథకు ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సీన్స్, విజువల్ గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.