దారి మలుపులో దెయ్యం .. ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్!
- మలయాళంలో రూపొందిన 'సుమతి వలవు'
- యథార్థ సంఘటన ఆధారంగా అల్లిన కథ
- 25 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన సినిమా
- జీ 5 చేతికి ఓటీటీ హక్కులు
- ఈ నెల 26వ తేదీ నుంచి అందుబాటులోకి
కేరళ - తిరువనంతపురం సమీపంలోని ఒక రోడ్డు మలుపును 'సుమతి వలవు' అనే పిలుస్తారు. 1950లలో ఒక రాత్రివేళ సుమతి అనే ఒక యువతి ఆ ప్రదేశంలో హత్య చేయబడింది. ఆమె దెయ్యంగా మారిపోయి అక్కడే తిరుగుతోందని చుట్టుపక్కల గ్రామాలవారు నమ్ముతూ ఉంటారు. ఆ ప్రదేశంలో తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉండటమే అందుకు కారణం. ఆ సంఘటన ఆధారంగానే ఈ సినిమాను రూపొందించారు.
అర్జున్ అశోకన్ .. గోకుల్ సురేశ్ .. సైజు కురుప్ .. బాలు వర్గీస్ .. మాళవిక మనోజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కథ అంతా కూడా దారి మలుపులోని దెయ్యం చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాకి రంజిన్ రాజ్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. మలయాళంలో 25 కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.