కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న... పార్టీ పేరు ఇదే!
- తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న
- ఎరుపు, ఆకుపచ్చ రంగులతో జెండా ఆవిష్కరణ
- జెండా మధ్యలో కార్మిక చక్రం, పిడికిలి
ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా పరిచయం చేశారు. పార్టీ జెండాను రెండు రంగులతో రూపొందించారు. జెండా పైభాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి. జెండా మధ్యలో కార్మిక చక్రాన్ని, దాని నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలి బిగించిన మానవుడి చేతిని చిహ్నంగా పొందుపరిచారు. ఈ చిహ్నానికి ఇరువైపులా రెండు ఆలీవ్ ఆకులను చేర్చారు. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే నినాదాన్ని ముద్రించారు.