బెట్టింగ్ యాప్ కేసు.. క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఈడీ సమన్లు
- అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశం
- 1xBet అనే యాప్‌తో సంబంధాలపై ఆరా తీయనున్న అధికారులు
- మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలం నమోదు
- గతంలో ఇదే కేసులో సురేశ్ రైనాను ప్రశ్నించిన ఈడీ
ఇలాంటి అక్రమ బెట్టింగ్ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం, పన్నులు ఎగవేయడం వంటి పలు కేసులపై ఈడీ దేశవ్యాప్తంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే గత నెలలో మరో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిఖర్ ధావన్‌ను కూడా విచారణకు పిలవడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.