బైక్ పై ప్రపంచయాత్ర.. యూకేలో బైక్ చోరీ
- సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ముంబై యువకుడి విన్నపం
- వీసా, పాస్ పోర్ట్ కూడా బైక్ లోనే ఉన్నాయనీ, కట్టుబట్టలతో మిగిలానంటూ ఆవేదన
- 118 రోజుల్లో 17 దేశాల గుండా 24 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు వెల్లడి
- నలుగురు యువకులు బైక్ ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తింపు
2025 మే 1న ముంబై నుంచి బైక్ పై ప్రపంచయాత్రకు బయలుదేరానని యోగేశ్ చెప్పారు. ఇప్పటి వరకు.. 118 రోజుల్లో 17 దేశాలను చుట్టేశానని, మొత్తంగా 24 వేల కిలోమీటర్లు తిరిగానని యోగేశ్ వివరించాడు. బైక్ చోరీ కావడంతో ప్రస్తుతం యాత్ర కొనసాగించాలన్నా.. ఇంటికి చేరుకోవాలన్నా వీలు లేకుండా పోయిందని నిరాశ వ్యక్తం చేశాడు. దొంగలు బైక్ ఎత్తుకెళుతున్న సీసీటీవీ ఫుటేజీని షేర్ చేస్తూ.. తన ఈ పోస్టును షేర్ చేయాలని, అధికారులు వేగంగా స్పందించేందుకు సాయం చేయాలని ఫాలోవర్లకు విజ్ఞప్తి చేశాడు.