నేడు పోలీసు విచారణకు రామ్ గోపాల్ వర్మ
- చంద్రబాబు, పవన్, లోకేశ్ మార్ఫింగ్ ఫొటోల కేసు
- ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకానున్న వర్మ
- ఈ కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
అయితే, ఈ కేసుకు సంబంధించి వర్మకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, పోలీసుల విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. ఈ క్రమంలో గత ఫిబ్రవరిలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మ ఒకసారి విచారణకు హాజరయ్యారు.
మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గత నెల 22న వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈరోజు హాజరవుతానని పోలీసులకు వర్మ సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వర్మ విచారణకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే వర్మ విచారణకు హాజరవుతారా? లేక చివరి నిమిషంలో డుమ్మా కొడతారా? అనేది ఉత్కంఠగా మారింది.