వేతన పెంపుపై చర్చలు ఫలించకపోతే షూటింగ్ లు బంద్: కార్మిక సంఘాలు
––
ఒకవేళ చర్చల ఫలితం సానుకూలంగా లేకుంటే షూటింగ్ లు పూర్తిగా ఆపేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే ఒకట్రెండు రోజులు సమయం ఇస్తామని చెప్పారు. ‘నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదు. ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువడే వరకు ఆయన సినిమా షూటింగ్ లకు మేము హాజరుకాబోము. నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్ ఛాంబర్‌కు నోటీసులు పంపిస్తాము. ఛాంబర్ నిర్ణయం ప్రకారమే తుది కార్యాచరణ ఉంటుంది’’ అని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.