వైఎస్ అవినాశ్ రెడ్డిని బలిపశువు చేయాలనుకుంటున్నారు: మేరుగు నాగార్జున
- చంద్రబాబు ఆటలో సునీత కీలుబొమ్మగా మారారన్న మేరుగు
- తండ్రిని ఓడించిన వారికి ఎలా మద్దతు ఇస్తున్నారో చెప్పాలన్న మేరుగు
- చంద్రబాబువి తప్పుడు రాజకీయాలని విమర్శ
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఒక వైపు అరాచకాలు చేస్తూనే... మరోవైపు మరోసారి వివేకా హత్య కేసును తెరపైకి తెచ్చారని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పుడు పద్ధతులతోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని... అందుకే సునీతను రంగంలోకి దించారని చెప్పారు. గత రెండు ఎన్నికల్లో వివేకా హత్య కేసును వాడుకుని లబ్ధి పొందాలని ప్రయత్నించారని మండిపడ్డారు.