తల్లి ఖాతాలో కోటీ 13 లక్షల కోట్లు డిపాజిట్.. ఫోన్లో మెసేజ్ చూసి కొడుకు షాక్
- ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో సంచలనంగా మారిన ఉదంతం
- బ్యాంకును ఆశ్రయించిన యువకుడు.. కోటక్ మహేంద్ర బ్యాంకులో ఘటన
- అలాంటి ఘటన ఏమీ జరగలేదంటూ బ్యాంకు అధికారుల వివరణ
ఉదయం ఆ మెసేజ్ చూసిన దీపక్ వెంటనే డాంకౌర్ పరిధిలోని బ్యాంకుకు పరుగు తీశాడు. షాక్‌కు గురైన బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాను స్తంభింపజేశారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కోటక్ మహీంద్ర బ్యాంకు అధికారులు స్పందించారు. యువకుడి తల్లి ఖాతాలో కోటి కోట్లు జమ అయినట్లు జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని వివరణ ఇచ్చారు. అలాంటి సంఘటన ఏదీ తమ బ్యాంకులో చోటుచేసుకోలేదని వారు స్పష్టం చేశారు.