కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నేతలకు ఊరట.. కేసులపై స్టే ఇచ్చిన హైకోర్టు
- వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు
- ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కొడాలి నాని
- దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
అలానే వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, అప్పిరెడ్డిలకు కూడా హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదు చేయగా, వీరు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులపైనా హైకోర్టు స్టే ఇచ్చింది. అదే విధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై నమోదైన కేసులో కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.