బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో కీలక పరిణామం!
- బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను కేంద్ర హోంశాఖకు పంపించిన గవర్నర్
- న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపిన జిష్ణుదేవ్ వర్మ
- సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు
సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళతామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆర్డినెన్స్‌ను కేంద్రానికి పంపించడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో సెప్టెంబరు 30లోగా స్థానిక ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.