ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- రాజకీయ పోరాటం చేయొద్దని హితవు
- అది అధికార దుర్వినియోగమేనని ఆగ్రహం
- కర్ణాటక హైకోర్టు తీర్పుపై పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలిస్తూ.. ఈ వ్యవహారంలో ఈడీ రాజకీయ పోరాటం చేస్తోందని సుప్రీం ధర్మాసనం విమర్శించింది. ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. పిటిషన్ పరిగణనలోకి తీసుకోవడంలేదని స్పష్టం చేసింది. ఈడీని రాజకీయ పోరాటాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసు విచారణకు స్వీకరించడంపై సీజేఐ బెంచ్ అయిష్టత వ్యక్తం చేసింది.