డబ్ల్యూసీఎల్‌లో భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. నిర్వాహకుల క్షమాపణలు
- డబ్ల్యూసీఎల్‌లో నేడు భారత్-పాక్ మ్యాచ్
- పహల్గామ్ దాడి నేపథ్యంలో మ్యాచ్‌పై విమర్శలు
- పాక్‌తో ఆడేది లేదన్న భారత ఆటగాళ్లు
- విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన నిర్వాహకులు
డబ్ల్యూసీఎల్ సీజన్ 2 ఈ నెల 18న ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్ పాకిస్థాన్ చాంపియన్స్-ఇంగ్లండ్ చాంపియన్స్ మధ్య జరిగింది. అయితే, ఈ సీజన్‌లో ఇవాళ జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగానే మ్యాచ్ నిర్వహిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాదు, ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు తెలిపారు.